WhatsAppలో AI చాట్ ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్ ఫీచర్‌ను వాట్సాప్‌లో అందించనున్నారు. గతంలో మెటా సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు AI అసిస్టెంట్‌లను జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు దీనికి అనుగుణంగా చర్యలు మొదలు పెట్టింది. Instagram, ఫేస్‌బుక్ వంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌లను యాడ్ చేస్తామని కంపెనీ గతంలో పేర్కొనగా, ఇప్పడు వాట్సాప్‌లో తీసుకొస్తుంది. ప్రస్తుతానికి Android 2.23.24.26 WhatsApp బీటాకు అప్‌డేట్ చేసిన కొంత మంది వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంది. అన్ని టెస్టింగ్‌లు పూర్తయ్యాక అందరికి విడుదల చేయనున్నారు. ఈ చాట్‌బాట్‌లు మెటా భాషా మోడల్, Llama 2 తో పనిచేస్తాయి. AI చాట్‌బాట్ కోసం కొత్త ఆప్షన్ విడిగా యాప్‌లోనే ఉంటుంది.