Comet:ఆకాశంలో అరుదైన అద్భుతం.. మళ్లీ 80 ఏళ్ల తర్వాతే!
ఆకాశంలో కొన్ని కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.
దిశ,వెబ్‌డెస్క్: ఆకాశంలో కొన్ని కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇక ఆకాశంలో తోకచుక్కలు(comets) కనిపించడం మామూలు విషయమే అయినప్పటికీ ఈ నెల 10న అత్యంత అరుదైన తోక చుక్క కనిపించనుందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. సుచిన్‌షాన్-అట్లాస్ అనే తోకచుక్క భూమికి 44 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని నాసా వెల్లడించింది. 2023లో సూర్యుడికి అత్యంత సమీపంగా ప్రయాణించినపుడు దీన్ని తొలిసారి గుర్తించామని పేర్కొంది.
ఈనెల 9-10 తేదీల మధ్య స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వివరించింది. ఈ తోకచుక్క భూమి సమీపానికి(Earth is near) మళ్లీ వచ్చేది మరో 80 సంవత్సరాల తర్వాతే అని ఖగోళ శాస్త్రవేత్త(Astronomers)లు అంటున్నారు. దీంతో మన జీవిత కాలంలో అత్యంత అరుదుగా వచ్చే ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలని అందరూ వెయిట్ చేస్తారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే నేరుగా మన కళ్ళతో చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 10న ఆకాశంలో ఈ అరుదైన తోకచుక్క కనువిందు చేయనుంది.