Chrome బ్రౌజర్‌లో డబుల్ క్లిక్‌తో ట్యాబ్‌లను క్లోజ్ చేసే ఫీచర్
సెర్చింజన్ గూగుల్ కొత్తగా షార్ట్‌కట్ ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: సెర్చింజన్ గూగుల్ కొత్తగా షార్ట్‌కట్ ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. తన క్రోమ్ బ్రౌజర్‌లో ట్యాబ్‌లను మూసివేయడానికి వేగవంతమైన షార్ట్‌కట్ కీని అందించనుంది. కొత్త సదుపాయం ద్వారా వినియోగదారులు బ్రౌజర్ ట్యాబ్‌లను డబుల్ క్లిక్ ద్వారా క్లోజ్ చేయవచ్చు. ఇంతకు ముందు కీబోర్డ్‌పై Ctrl+W టైప్ చేస్తే రన్నింగ్ ట్యాబ్ క్లోజ్ అవుతుంది. లేదా మౌస్‌తో డిస్‌ప్లై చివరన క్రాస్ చిహ్నంపై క్లిక్ చేస్తే ట్యాబ్ క్లోజ్ అవుతుంది. అయితే ఈ కొత్త ఆప్షన్‌తో సాధారణ డబుల్-క్లిక్‌తో కావాల్సిన ట్యాబ్‌లను మూసివేయవచ్చని ఒక నివేదిక పేర్కొంది. అలాగే గూగుల్ Chrome బ్రౌజర్‌లో హిస్టరీ డేటాను తొలగించడానికి 'క్విక్ డిలీట్' అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తుంది.