పాత సాంప్రదాయానికి తెరలేపిన రాహుల్ ద్రవిడ్
దిశ, స్పోర్ట్స్: టెస్టు క్రికెట్‌లో ఉన్న పాత సాంప్రదాయానికి రాహుల్ ద్రవిడ్ తెరలేపాడు. స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్‌లలో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేసిందంటే.. దానికి ఆటగాళ్ల టాలెంట్‌తో పాటు పిచ్ సహకరించడం కూడా ముఖ్యం. న్యూజీలాండ్‌తో సిరీస్‌లో రెండు టెస్టుల్లో భారత జట్టు 1-0 తేడాతో గెలిచింది. కాన్పూర్ టెస్టు కూడా భారత జట్టు దాదాపు గెలిచినంత పని చేసింది. ఆఖర్లో రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ పోరాడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే […]
దిశ, స్పోర్ట్స్: టెస్టు క్రికెట్‌లో ఉన్న పాత సాంప్రదాయానికి రాహుల్ ద్రవిడ్ తెరలేపాడు. స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్‌లలో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేసిందంటే.. దానికి ఆటగాళ్ల టాలెంట్‌తో పాటు పిచ్ సహకరించడం కూడా ముఖ్యం. న్యూజీలాండ్‌తో సిరీస్‌లో రెండు టెస్టుల్లో భారత జట్టు 1-0 తేడాతో గెలిచింది. కాన్పూర్ టెస్టు కూడా భారత జట్టు దాదాపు గెలిచినంత పని చేసింది. ఆఖర్లో రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ పోరాడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే మ్యాచ్‌లో అయ్యర్ ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీ చేశాడు. అంతే కాకుండా భారత జట్టు ఆఖరి రోజు రెండు సెషన్లలో తొమ్మిది వికెట్లు తీసింది. ఇక ముంబై టెస్టులో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించింది.
ఇందుకు గాను టీమ్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్స్‌మెన్‌కు నజరానా అందించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్.. కాన్పూర్ గ్రీన్‌పార్క్ స్టేడియం సిబ్బందికి రూ. 35 వేల నగదుతో పాటు ఒక కాగితంలో వారిని అభినందిస్తూ లేఖ రాశారు. ముంబై వాంఖడే సిబ్బందికి కూడా ఆయన రూ. 35 వేల నగదును అందించారు. ఈ సాంప్రదాయాన్ని గతంలో కెప్టెన్లుగా ఉన్న కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ద్రావిడ్, ధోని అనుసరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కష్టపడిన గ్రౌండ్స్‌మెన్‌కు టిప్ ఇచ్చే వాళ్లు. ధోనీ కూడా టెస్టుల్లో ఇలాగే చేసేవాడు. ఆ తర్వాత అజింక్య రహానే తాను కెప్టెన్‌గా ఉన్న టెస్టులకు చేసేవాడు. కోహ్లీ-శాస్త్రి మాత్రం ఈ సాంప్రదాయాన్ని ఆపేశారు. ఇప్పుడు ద్రవిడ్ తిరిగి ప్రారంభించాడు.