టీమిండియా.. ‘థీమ్’లో తకదిం!
ప్రపంచ ఛాంపియన్ ఘోరపరాజయం పాలైంది. టీమిండియా గెలుపు థీమిండియా కొంతకాలంగా భాసిల్లుతోంది. అయితే తాజాగా న్యూజీలాండ్ పర్యటనలో తడబడుతోంది. ఈ క్రమంలో వరుస టెస్టు విజయాలకు భారత జట్టు ఫుల్ స్టాప్ పెట్టింది. ఐసీసీ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ భారత జట్టు కివీస్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాక ఘోరపరాజయం చవిచూడడం టీమిండియాకు ఇదే తొలిసారి. ఇప్పటికే వన్డేల్లో వైట్ వాష్ చేయించుకుని.. టెస్టుల్లో నెగ్గడం ద్వారా పరువు […]
ప్రపంచ ఛాంపియన్ ఘోరపరాజయం పాలైంది. టీమిండియా గెలుపు థీమిండియా కొంతకాలంగా భాసిల్లుతోంది. అయితే తాజాగా న్యూజీలాండ్ పర్యటనలో తడబడుతోంది. ఈ క్రమంలో వరుస టెస్టు విజయాలకు భారత జట్టు ఫుల్ స్టాప్ పెట్టింది. ఐసీసీ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ భారత జట్టు కివీస్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాక ఘోరపరాజయం చవిచూడడం టీమిండియాకు ఇదే తొలిసారి. ఇప్పటికే వన్డేల్లో వైట్ వాష్ చేయించుకుని.. టెస్టుల్లో నెగ్గడం ద్వారా పరువు నిలబెట్టుకుందామని భావించిన భారత జట్టుకు తొలి టెస్టులో ఊహించని పరాజయం ఎదురైంది.
టీమిండి సుదీర్ఘ కాలం తరువాత కాగితం పులులు ట్యాగ్‌కు న్యాయం చేకూర్చారు. టీమిండియా గురించి ఏ జట్టైనా మాట్లాడాల్సి వస్తే.. ఆటగాళ్లంతా మ్యాచ్ విన్నర్లేనని ప్రత్యర్థులు పొగుడుతుంటారు. టీమిండియా ఆటగాళ్ల గత ప్రదర్శన చూసినా అది నిజమేనని అంగీకరించాల్సిందే. అయితే పేలవ ఆటతీరుతో కివీస్ గడ్డపై మట్టికరిచిన విధానం సగటు అభిమానిని నిరాశకు గురిచేసింది. టీ20ల్లో అద్భుతమైన ఫాంలో ఉన్న ఆటగాళ్లు పరిమిత ఓవర్లతో పాటు సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా పరాజయం పాలవ్వడం క్రీడాపండితులను నివ్వెరపోయేలా చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శనతో టీమిండియా కేవలం 165 పరుగులకే చాపచుట్టేసింది. ఈ మధ్యకాలంలో టీమిండియా ఇంత తక్కువ స్కోరు నమోదు చేయలేదు. మయాంఖ్ అగర్వాల్ (34), రహానే (46), షమి (21) ఓ మోస్తరుగా ఆడడంతో ఆమాత్రం స్కోరైనా టీమిండియా చేయగలిగింది. దీనికి జవాబుగా న్యూజిలాండ్ జట్టు 348 పరుగులు చేసింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మయాంఖ్ అగర్వాల్ అర్ధసెంచరీ చేసినప్పటికీ టీమిండియా 191 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ రెండు ఓవర్లలో 9 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో ఒకటి గెలుచుకుని ఆధిక్యంలో నిలిచింది.
టీ20ల్లో రాణించిన కేఎల్ రాహుల్‌ను కాదని పృథ్వీషాకు స్థానం కల్పించడం కోహ్లీ చేసిన ఘోరమైన తప్పిదం. గతంలో కేఎల్ రాహుల్ టెక్నిక్ పరంగా టెస్టు ఆటగాడిగా ముద్రవేసుకున్నాడు. అలాంటి రాహుల్‌ను టెస్టుల్లో ఆడించకుండా విదేశీ గడ్డపై ఏమాత్రం అనుభవం లేని పృథ్వీషాను ఆడించడం విమర్శలకు తావిచ్చింది. పేస్ బౌలింగ్ దాడికి భారత ఆటగాళ్లు నిలవలేకపోయారు. వన్డేల్లో చేసిన తప్పుల నుంచి టీమిండియా ఆటగాళ్లు ఎలాంటి పాఠాలు నేర్చుకోనట్టే కనబడుతోంది. ఇదేఆటతీరు ప్రదర్శిస్తే టీమిండియా టెస్టుల్లో కూడా క్లీన్ స్వీప్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Read also..