సాధన ప్రారంభించిన టీమ్ ఇండియా

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు ఫిబ్రవరి 5 నుంచి చేపాక్ స్టేడియంలో ప్రారంభం కానుంది. గత ఆరు రోజులుగా క్వారంటైన్‌లో ఉంటున్న టీమ్ ఇండియా క్రికెటర్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది అందరూ నెగెటివ్‌గా తేలడంతో నెట్ ప్రాక్టీస్‌కు అనుమతి లభించింది. సోమవారం సాయంత్రం మైదానంలోకి వచ్చి కాసేపు గడిపిన టీమ్ ఇండియా క్రికెటర్లు కొద్ది […]

Update: 2021-02-01 10:05 GMT

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు ఫిబ్రవరి 5 నుంచి చేపాక్ స్టేడియంలో ప్రారంభం కానుంది. గత ఆరు రోజులుగా క్వారంటైన్‌లో ఉంటున్న టీమ్ ఇండియా క్రికెటర్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది అందరూ నెగెటివ్‌గా తేలడంతో నెట్ ప్రాక్టీస్‌కు అనుమతి లభించింది. సోమవారం సాయంత్రం మైదానంలోకి వచ్చి కాసేపు గడిపిన టీమ్ ఇండియా క్రికెటర్లు కొద్ది సేపు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. మంగళవారం నుంచి టీమ్ పూర్తి స్థాయిలో సాధనను ప్రారంభించనున్నట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. పూర్తి బయోబబుల్‌లో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో స్థానిక క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లు కూడా జట్టుతో పాటు హోటల్‌లోనే గడుపుతున్నారు. చేపాక్ స్టేడియంలో టీమ్ ఇండియా క్రికెటర్లు మాట్లాడుకుంటున్న ఫొటోలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..