ఇంగ్లాండ్ క్వారంటైన్‌లో కోహ్లీ సేన
దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్, 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన టీమ్ ఇండియా క్వారంటైన్‌లో ఉన్నది. తొలి మూడు రోజులు కఠిన క్వారంటైన్ అని బ్రిటన్ ప్రభుత్వం చెప్పినా.. జట్టులోని ఆటగాళ్లకు సడలింపులు ఇచ్చినట్లే కనపడుతున్నది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంను ఆనుకొని ఉన్న స్టార్ హోటల్‌లోనే టీమ్ ఇండియా క్రికెటర్లు బస చేస్తున్నారు. హోటల్ నుంచి నేరుగా స్టేడియంకు దారి ఉండటంతో అక్కడ బాల్కనీలో నిలబడి ఫొటోలు దిగారు. కాగా ఆటగాళ్లు […]
దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్, 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన టీమ్ ఇండియా క్వారంటైన్‌లో ఉన్నది. తొలి మూడు రోజులు కఠిన క్వారంటైన్ అని బ్రిటన్ ప్రభుత్వం చెప్పినా.. జట్టులోని ఆటగాళ్లకు సడలింపులు ఇచ్చినట్లే కనపడుతున్నది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంను ఆనుకొని ఉన్న స్టార్ హోటల్‌లోనే టీమ్ ఇండియా క్రికెటర్లు బస చేస్తున్నారు. హోటల్ నుంచి నేరుగా స్టేడియంకు దారి ఉండటంతో అక్కడ బాల్కనీలో నిలబడి ఫొటోలు దిగారు. కాగా ఆటగాళ్లు ఎవరూ ఒకరిని మరొకరు కలుసుకోవద్దని బీసీసీఐ చెప్పినట్లు అక్షర్ పటేల్ అన్నాడు.
‘ఫ్లైట్ దిగిన తర్వాత జెట్ లాగ్‌తో చాలా సేపు నిద్రపోయాను. ఇక మరో రోజు గడిస్తే హాయిగా అందరం కలుసుకోవచ్చు’ అని అన్నాడు. టీమ్ ఇండియా కుటుంబ సభ్యులతో సౌతాంప్టన్‌లోని హోటల్ లోనే ఉన్నారు. అయితే ఆటగాళ్లు మాత్రమే మూడు రోజుల తర్వాత సాధన చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు మాత్రం 10 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉండబోతున్నారు. కాగా, మహిళా జట్టు కూడా క్వారంటైన్‌లోనే ఉన్నారు. 10 రోజుల తర్వాత వాళ్లు బ్రిస్టల్ వెళ్లనున్నట్లు బీసీసీఐ తెలిపింది.