టీమ్ ఇండియా ఆటగాళ్ల ఆహారంపై బీసీసీఐ ఆంక్షలు
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్‌తో తొలి టెస్టు ఆడటానికి టీమ్ ఇండియా ప్రస్తుతం కాన్పూర్ చేరుకున్నది. న్యూజీలాండ్, ఇండియా జట్లు సోమవారమే కాన్పూర్ చేరుకున్నాయి. ఇరు జట్లకు కూడా కాన్పూర్‌లోని హోటల్‌లోనే బయోబబుల్ ఏర్పాటు చేసి అందులో బస ఏర్పాటు చేశారు. కాగా, టీమ్ ఇండియా ఆటగాళ్ల ఫుడ్ మెనూపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. ఆటగాళ్లకు వడ్డించే వంటకాల్లో బీఫ్, పోర్క్ ఉండకూడదని హోటల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. బీఫ్, పోర్క్ ఏ రూపంలో ఉన్నా.. వాటిని […]
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్‌తో తొలి టెస్టు ఆడటానికి టీమ్ ఇండియా ప్రస్తుతం కాన్పూర్ చేరుకున్నది. న్యూజీలాండ్, ఇండియా జట్లు సోమవారమే కాన్పూర్ చేరుకున్నాయి. ఇరు జట్లకు కూడా కాన్పూర్‌లోని హోటల్‌లోనే బయోబబుల్ ఏర్పాటు చేసి అందులో బస ఏర్పాటు చేశారు. కాగా, టీమ్ ఇండియా ఆటగాళ్ల ఫుడ్ మెనూపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. ఆటగాళ్లకు వడ్డించే వంటకాల్లో బీఫ్, పోర్క్ ఉండకూడదని హోటల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. బీఫ్, పోర్క్ ఏ రూపంలో ఉన్నా.. వాటిని ఆటగాళ్ల మెనూలో మాత్రం చేర్చవద్దని స్పష్టం చేసింది. మరోవైపు ఆటగాళ్లకు వడ్డించే మాంసాహారం తప్పని సరిగా హలాల్ చేసి ఉండాలని పేర్కొన్నది. హోటల్‌లో ఆల్‌డే కౌంటర్ ఉంచాలని.. స్టేడియం వద్ద బ్రేక్ ఫాస్ట్, లంచ్, టీ ఏర్పాటు చేయాలని. హోటల్ వద్ద రాత్రి భోజనం అందిచాలని బీసీసీఐ తెలిపింది. కాగా, ఫిట్‌నెస్ లెవెల్స్ పెంచుకోవడానికి చాలా మంది ఆటగాళ్లు బీఫ్, పోర్క్ వంటి పదార్దాలను తమ మెనూలో ఉండేలా చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఇలా ఆహారంపై ఆంక్షలు విధించడం విచిత్రంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.