Crime News : కీచక టీచర్.. ఏళ్ల తరబడి 500 మంది విద్యార్థినులను..

దిశ, వెబ్‌డెస్క్ : ఉపాధ్యాయుడు అంటే అందరికి ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులకు దిక్సూచిలా ఉండాలి. కానీ ఓ ఉపాధ్యాయుడు ఆ వృత్తికే కళంకం తెస్తూ.. ఏ గురువు చేయని పని చేసి కటకటలాపాలయ్యాడు. కీచకుడిగా మారిన ఆ ఉపాధ్యాయుడు ఏకంగా 500 మంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అభాసుపాలయ్యాడు. చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలోని ఓ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కామర్స్ బోధిస్తాడు. ఈ క్రమంలో […]

Update: 2021-05-29 02:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉపాధ్యాయుడు అంటే అందరికి ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులకు దిక్సూచిలా ఉండాలి. కానీ ఓ ఉపాధ్యాయుడు ఆ వృత్తికే కళంకం తెస్తూ.. ఏ గురువు చేయని పని చేసి కటకటలాపాలయ్యాడు. కీచకుడిగా మారిన ఆ ఉపాధ్యాయుడు ఏకంగా 500 మంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అభాసుపాలయ్యాడు. చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై నగరంలోని ఓ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కామర్స్ బోధిస్తాడు. ఈ క్రమంలో మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థినులు, చదువులో వెనకబడిన బాలికలను ఎంచుకుని వారికి సరైన శిక్షణ ఇచ్చి విద్యాబుద్దులు నేర్పించాల్సిందిపోయి.. కీచకుడిలా మారి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాలికలను దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చోపెట్టుకుని, చెడుగా తడుముతూ ముద్దులు పెట్టేవాడు. క్లాస్ రూంలోనూ అసభ్యంగా తడిమేవాడు. అతడి వికృత చేష్టలను ఎదురించిన బాలికలను, ఇంట్లో చెబుతాం అన్నవారిని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడు.

ఇలా ఏళ్ల తరబడి ఆ ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల పాఠశాలకు వచ్చిన పూర్వ విద్యార్థుల సంఘం వారికి ఓ బాలిక ఉపాధ్యాయుడి కీచక పర్వాన్ని వివరించింది. ఈ ఘటనపై వారు ఎంక్వేరి చేయగా.. ఆ ఉపాధ్యాయుడు కొన్నేళ్ల నుంచి ఇదే మాదిరిగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్లు బయటపడింది. వెంటనే పాఠశాల యాజమాన్యం నిజనిర్ధారణ కమిటీని వేసి విచారణ చేపట్టగా.. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థినులతో పాటు పూర్వ విద్యార్థినులను కూడా అతడు సెక్స్‌వల్ గా వేధించినట్లు తేలింది. ఇలా మొత్తం 500 మంది ఆ కీచకుడి దారుణాలను రాతపూర్వకంగా బయటపెట్టారు. వెంటనే పాఠశాల యాజమాన్యం అతడిని సస్పెండ్ చేసింది. పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News