పుస్తకం వదిలి కత్తి పట్టిన టీచర్..!
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఫ్యాక్షన్ సినిమా చూపించాడు. పుస్తకం పట్టాల్సిన చేత్తో కత్తి పట్టి తోటి సహ ఉద్యోగిపై దాడికి యత్నించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కదిరిలోని మున్సిపల్ బాలికల పాఠశాలలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. ఒకే చోట పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుడు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే ధనుంజయ్‌పై రమేష్ అనే టీచర్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర […]
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఫ్యాక్షన్ సినిమా చూపించాడు. పుస్తకం పట్టాల్సిన చేత్తో కత్తి పట్టి తోటి సహ ఉద్యోగిపై దాడికి యత్నించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కదిరిలోని మున్సిపల్ బాలికల పాఠశాలలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. ఒకే చోట పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుడు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే ధనుంజయ్‌పై రమేష్ అనే టీచర్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే, వీరిద్దరి మధ్య తలెత్తిన గొడవకు గల కారణం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.