ఆ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలా.?
దిశ, విశాఖపట్నం: పేదలకు నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడం ఏంటని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రడు ఆరోపించారు. శనివారం విశాఖ జిల్లాలోని నాతవరం మండం గునుపూడి రెవెన్యూ పరిధిలో పేదల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలను టీడీపీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు, కొండగెడ్డలు, వాగుల వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంచి స్థలాలను ఎంపిక చేయాలని డిమాండ్ […]
దిశ, విశాఖపట్నం: పేదలకు నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడం ఏంటని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రడు ఆరోపించారు. శనివారం విశాఖ జిల్లాలోని నాతవరం మండం గునుపూడి రెవెన్యూ పరిధిలో పేదల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలను టీడీపీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు, కొండగెడ్డలు, వాగుల వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంచి స్థలాలను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక పాలసీతో రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, నాణ్యతలేని మద్యం అధిక ధరతో అమ్మి ప్రజల ప్రాణాలను గుల్ల చేస్తున్నారని మండిపడ్డారు.