నేడు టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశం

దిశ, వెబ్‌డెస్క్: నేడు టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం ఆలయాలపై దాడుల అంశమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Update: 2021-01-04 21:01 GMT

Tags:    

Similar News