CM Chandrababu:అమిత్ షా పై జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన ఏపీ సీఎం

భారత రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్(Dr. BR Ambedkar) పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.

Update: 2024-12-19 13:27 GMT

దిశ,వెబ్‌డెస్క్: భారత రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్(Dr. BR Ambedkar) పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. ఈ మేరకు నేడు(గురువారం) మంత్రులతో చర్చించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘మనం మంచి ఉద్దేశంతో మాట్లాడినా దానిని చెడుగా చిత్రీకరించేందుకు కొందరు ఎదురు చూస్తుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో నేను ‘వ్యవసాయం దండగ’ అని అనలేదు. కానీ అప్పట్లో కొందరు అన్నట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు అమిత్ షాపై కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. అసలు అంబేద్కర్ ఓడిపోయింది కాంగ్రెస్ హయాంలోనే. ఆ పార్టీ హయాంలోనే ఆయనకు గౌరవం దక్కలేదు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్‌ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, అంబేద్కర్‌కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే తదితర అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News