బిగ్ బ్రేకింగ్: పరిషత్ ఎన్నికలపై టీడీపీ సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: పరిషత్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని, అందుకే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, నేడు(ఆదివారం) ఆంధ్రప్రదేశ్ […]
దిశ, వెబ్‌డెస్క్: పరిషత్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని, అందుకే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, నేడు(ఆదివారం) ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం పాలైంది. ఏపీవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ మాజీమంత్రి, శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలు జరుగుతున్నాయని, టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించిందని అన్నారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ జరుగుతోంది. పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం వల్లే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించిందన్నారు.