జగన్‌కు అయ్యన్న సవాల్…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరాడు. ‘‘జగన్‌కు దమ్ముంటే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం అన్నీ విశాఖలోనే పెట్టాలని’’ ఆయన డిమాండ్ చేశారు. విశాఖపై అంత ప్రేమ ఉంటే పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. విజయసాయిరెడ్డి విశాఖలో ఎందుకు ఇల్లు తీసుకుని ఉంటున్నారని, రాష్ట్రంలో ఎక్కడ భూములు లేవని… ఒక్క విశాఖలోనే భూములు దోచుకోవడానికి ఉన్నారని ఆరోపించారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను తప్పుబట్టిన వైసీపీ… విశాఖలో ఎందుకు […]
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరాడు. ‘‘జగన్‌కు దమ్ముంటే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం అన్నీ విశాఖలోనే పెట్టాలని’’ ఆయన డిమాండ్ చేశారు. విశాఖపై అంత ప్రేమ ఉంటే పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. విజయసాయిరెడ్డి విశాఖలో ఎందుకు ఇల్లు తీసుకుని ఉంటున్నారని, రాష్ట్రంలో ఎక్కడ భూములు లేవని… ఒక్క విశాఖలోనే భూములు దోచుకోవడానికి ఉన్నారని ఆరోపించారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను తప్పుబట్టిన వైసీపీ… విశాఖలో ఎందుకు ల్యాండ్ పూలింగ్ అంటోందని అయ్యన్న ప్రశ్నించారు. తాను ఏ తప్పు చేశానని కేసు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేదని… రకరకాల కారణాల చెప్పి పెన్షన్స్ తీసేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన విధానం బాగోలేక ప్రజలను తప్పు పట్టించే విధంగా రాజధాని మార్పు అని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బొత్స మంత్రిగా ఉన్నపుడు ఓక్స్ వేగన్ పరిశ్రమ ఎందుకు ఆనాడు ఈ ప్రాంతం నుండి వెళ్లి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని మార్పు అనేది చిన్న విషయం కాదని… ఇదే ప్రధాన సమస్య అని అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్రంలో సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే బాధ్యత కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు.