నిరుత్సాహ పడొద్దు.. భవిష్యత్ లో విజయం మనదే : చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఫలితాలపై నిరుత్సాహపడొద్దని కార్యకర్తలకు సూచించారు. ‘‘తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలారా… స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం మీలో ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారు. మీ పోరాటస్ఫూర్తికి వందనాలు. ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార […]
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఫలితాలపై నిరుత్సాహపడొద్దని కార్యకర్తలకు సూచించారు. ‘‘తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలారా… స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం మీలో ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారు. మీ పోరాటస్ఫూర్తికి వందనాలు. ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడాం. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదాం. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే’’….చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.