చంద్రబాబుకు భారీ షాక్.. కంచుకోటను బద్దలు కొట్టిన 23 ఏళ్ల యువతి
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలో 23 ఏళ్ల అశ్విని అనే యువతి 30 ఏళ్ల కుప్పం రాజకీయ స్వరూపాన్ని మార్చేసింది. ప్రస్తుతం అశ్విని గెలుపు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్‌గా మారింది. 1989 నుంచి కుప్పం మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీగా మరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా టీడీపీ […]
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలో 23 ఏళ్ల అశ్విని అనే యువతి 30 ఏళ్ల కుప్పం రాజకీయ స్వరూపాన్ని మార్చేసింది. ప్రస్తుతం అశ్విని గెలుపు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్‌గా మారింది. 1989 నుంచి కుప్పం మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీగా మరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా టీడీపీ గెలుచుకుంటూ వస్తోంది. ముప్పై ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. అశ్విని రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి అయిన అశ్వినికి 1240 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 70 ఓట్లు, ఇతరులు నోటాకు కలిపి 27 ఓట్లు వచ్చాయి. దీంతో 1073 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి అశ్విని గెలుపొందింది.
అంతేగాకుండా.. చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలోనూ చంద్రబాబుకు షాక్ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీని సైతం వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.