జగన్‌కు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు..

దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపు సరికాదన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, బాల వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ, రాయల సీమ ఎత్తిపోతల వల్ల జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని లేఖలో పేర్కొన్నారు. పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్‌పైనే ఆధారపడ్డాయి. […]

Update: 2021-07-11 01:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపు సరికాదన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, బాల వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ, రాయల సీమ ఎత్తిపోతల వల్ల జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని లేఖలో పేర్కొన్నారు. పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్‌పైనే ఆధారపడ్డాయి. శ్రీశైలం నిండకుండా ప్రాజెక్టులు కడితే తమ ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటని నిలదీశారు. గుంటూరు ఛానల్‌ దగ్గుబాడు వరకు పొడిగించి పొలాలకు నీళ్లివ్వాలని ఎమ్మెల్యేలు లేఖలో డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లాలో 15 ఏళ్లలో మూడు సార్లే సాధారణ వర్షపాతం నమోదైందని.. ఆ తర్వాత మిగిలిన పన్నెండేళ్లు కరవే అని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో మరింత చేటు జరిగేలా ఉందని లేఖలో ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంపు విషయంలో పునరాలోచించాలని ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ను కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతుంది. ఆ అడ్డంకులను ఎలా తొలగించుకోవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో సొంత రాష్ట్రంలోనే ఒక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఇలా అభ్యంతరం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేల అభ్యంతరం ఒక విధంగా చెప్పాలంటే సీఎం జగన్‌కు ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News