ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ప్రశ్నించే గొంతులను నొక్కుతారా?

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌కి, అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ స్పీకర్‌కు నివేదిక అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందించారు. ‘చట్టసభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడకుండా చేయడం అనేది […]

Update: 2021-09-23 04:24 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌కి, అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ స్పీకర్‌కు నివేదిక అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందించారు. ‘చట్టసభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడకుండా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అది వాక్ స్వాతంత్ర్య హక్కును హరించడమే. గతంలో వైసీసీ నేతలు అసెంబ్లీలో ఎంతో దారుణంగా ప్రవర్తించారు. స్పీకర్ పోడియం ఎక్కి ఆందోళనలు చేపట్టారు. కానీ ఇప్పుడేమో మాట్లాడటమే ఓ నేరంగా పరిగణిస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయంపై ప్రివిలేజ్ కమిటీ వెంటనే పునరాలించుకోవాలి ’ అంటూ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News