‘ఆస్తులను కాపాడుకోవడానికే ఆర్టీసీ ఒప్పందం’
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ తెలంగాణలో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయడానికే టీఎస్‌ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ఈ నిర్ణయంతో ఏపీఎస్ఆర్టీసీ మనుగడకే ప్రమాదమని అచ్చెన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేతగానితనంతోనే 1,04, 368 కి.మీ కోల్పోయామన్నారు. దీంతో మరింత నష్టం వచ్చే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.