‘నన్ను చంపేందుకు కుట్ర.. 22వ తేదీ డెడ్ లైన్’

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేతల అరెస్టుల నేపథ్యంలో ఆ పార్టీ నేత బొండా ఉమ స్పందిస్తూ.. కొంతమంది టీడీపీ నాయకులను హత్య చేయడానికి ప్రణాళిక రచించారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు జూన్ 22 డెడ్ లైన్ పెట్టారని, ఈ మేరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. టీడీపీ నేతల ప్రాణాలకు హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. బెదిరింపులకు లొంగితే వైఎస్సార్సీపీ కండువా కప్పుతున్నారని, లొంగకపోతే అరెస్ట్ చేస్తున్నారని […]

Update: 2020-06-15 10:10 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేతల అరెస్టుల నేపథ్యంలో ఆ పార్టీ నేత బొండా ఉమ స్పందిస్తూ.. కొంతమంది టీడీపీ నాయకులను హత్య చేయడానికి ప్రణాళిక రచించారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు జూన్ 22 డెడ్ లైన్ పెట్టారని, ఈ మేరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. టీడీపీ నేతల ప్రాణాలకు హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. బెదిరింపులకు లొంగితే వైఎస్సార్సీపీ కండువా కప్పుతున్నారని, లొంగకపోతే అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో ఈఎస్ఐ స్కాంలో అధికారులపై చర్యలు తీసుకున్నారు తప్ప, మంత్రులపై కాదని బోండా ఉమ తెలిపారు. జగన్ మాటలు వింటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.

Tags:    

Similar News