‘సీఎం కుర్చీలో కూర్చునే అర్హత జగన్‌కు లేదు’
దిశ, ఏపీ బ్యూరో : సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ కీలక నేత, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసమర్థత వల్లే కేసీఆర్ కృష్ణా జలాల్లో సగం వాటా అడుగుతున్నారని మండిపడ్డారు. జగన్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని మండిపడ్డారు. అనంతపురం వైఎస్సార్ రైతు దినోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. సీఎం హోదాలో ఉండి ఆయన వాడిన భాష తీవ్ర ఆక్షేపణీయమన్నారు. సంయమనం కోల్పోయి […]
దిశ, ఏపీ బ్యూరో : సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ కీలక నేత, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసమర్థత వల్లే కేసీఆర్ కృష్ణా జలాల్లో సగం వాటా అడుగుతున్నారని మండిపడ్డారు. జగన్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని మండిపడ్డారు. అనంతపురం వైఎస్సార్ రైతు దినోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. సీఎం హోదాలో ఉండి ఆయన వాడిన భాష తీవ్ర ఆక్షేపణీయమన్నారు. సంయమనం కోల్పోయి బజారు మాటలు మాట్లాడారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో గాడిదలు కాయలేదని రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారని చెప్పుకొచ్చారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ముంపు మండలాలను విలీనం చేశారని చెప్పుకొచ్చారు. రాయలసీమ ప్రయోజనాలను కేసీఆర్ కాళ్ల ముందు తాకట్టు పెట్టిన జగన్‌కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. జగన్ వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. నీ ప్రభుత్వం దగ్గర ఉన్న మినిట్స్ ఒక్కసారి చదువు. కేసీఆర్ సగం వాటా అడుగుతున్నాడు అంటే అది నీ డొల్లతనమంటూ విరుచుకుపడ్డారు. జగన్ తన అసమర్థతను కప్పిపుచుకోవడం కోసం కొత్త నాటకాలు, వివాదాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా సీఎం జగన్ రెండేళ్లుగా రాష్ట్రానికి న్యాయం చేయాల్సింది పోయి తీవ్ర అన్యాయం చేశారని ఘాటుగా విమర్శించారు. వైఎస్ షర్మిల సైతం జగన్‌పై విమర్శలు చేస్తుదంటే పరిస్థితి ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. రాయలసీమ మేధావులు, యువత, ప్రజలు ముందుకు వచ్చి ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.