ఉద్రిక్తంగా మారిన టీడీపీ నిరసన

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా సారిపల్లిలో టీడీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. ‘నా ఇల్లు నా సొంతం- నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి’ అనే డిమాండ్‌ తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపడుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం విజయనగరంలోని సారిపల్లిలో టీడీపీ ఆందోళన చేపట్టింది. సారిపల్లిలో ఎన్టీఆర్‌ గృహలను పరిశీలించేందుకు టీడీపీ నేతలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమతి లేదంటూ టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో […]

Update: 2020-11-06 07:06 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా సారిపల్లిలో టీడీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. ‘నా ఇల్లు నా సొంతం- నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి’ అనే డిమాండ్‌ తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపడుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం విజయనగరంలోని సారిపల్లిలో టీడీపీ ఆందోళన చేపట్టింది. సారిపల్లిలో ఎన్టీఆర్‌ గృహలను పరిశీలించేందుకు టీడీపీ నేతలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనుమతి లేదంటూ టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నాయకులు అక్కడనుంచి తప్పించుకుని ఇళ్ల వద్దకు చేరుకున్నారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ద్వారంపూడి జగదీష్‌ మాట్లాడుతూ వైసీపీ కక్షపూరితంగా వ్యవహరించి గత ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తియి ఖాళీగా ఉన్న గృహలను సైతం పేదలకు ఇవ్వడం లేదని ఆరోపించారు.

Tags:    

Similar News