గవర్నర్ నిర్ణయం.. సంతోషకరం : యనమల

దిశ, వెబ్ డెస్క్: ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ నిర్ణయం సంతోషకరమని, ఏపీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని గవర్నర్ ఆదేశించడం సంతోషదాయకమని ఆయన అన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ న్యాయ విభాగానికి […]

Update: 2020-07-22 05:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ నిర్ణయం సంతోషకరమని, ఏపీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని గవర్నర్ ఆదేశించడం సంతోషదాయకమని ఆయన అన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ న్యాయ విభాగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైందని చెప్పారు. ఎస్ఈసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటినుంచైనా నిబంధనలకు అనుగుణంగా జగన్ ప్రవర్తించాలని హితవు పలికారు. ఇప్పటికీ నిమ్మగడ్డకు అడ్డంకులను సృష్టించాలని భావిస్తే మాత్రం.. రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభంలో పడినట్టేనని చెప్పారు.

Tags:    

Similar News