మూడు ముక్కల రాజధాని విధానంతో… రాష్ట్రం నాశనం

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సీఎం జగన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్దామని సీఎం జగన్‌కు, చంద్రబాబు సవాల్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఈ సవాల్‌ను స్వీకరించడానికి జగన్‌కు చంద్రబాబు 48 గంటల సమయం ఇచ్చారు. అయితే దీనిపై యనమల బుధవారం మాట్లాడుతూ… చంద్రబాబు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు వైసీపీ నేతలు ముందుకురావడం లేదని విమర్శించారు. ఎన్నిలకు రావడానికి వైసీపీ నేతలు […]

Update: 2020-08-04 04:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సీఎం జగన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్దామని సీఎం జగన్‌కు, చంద్రబాబు సవాల్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఈ సవాల్‌ను స్వీకరించడానికి జగన్‌కు చంద్రబాబు 48 గంటల సమయం ఇచ్చారు.

అయితే దీనిపై యనమల బుధవారం మాట్లాడుతూ… చంద్రబాబు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు వైసీపీ నేతలు ముందుకురావడం లేదని విమర్శించారు. ఎన్నిలకు రావడానికి వైసీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి విధానాన్ని కాకుండా… విధ్వంసకవిధానాన్ని అమలుచేస్తున్నారని అన్నారు. ఈ మూడు ముక్కల రాజధాని విధానంతో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సీఎం జగన్ చూస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News