108 కుంభకోణంపై ఆళ్ల నాని స్పందించాలి: పట్టాభిరామ్

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో 108 అంబులెన్స్‌ల నిర్వహణలో రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభిరామ్.. మరోసారి దీనిపై మాట్లాడుతూ, తాను చేసిన ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని అరబిందో ఫౌండేషన్‌కి 108 అంబులెన్స్‌ సర్వీసులను కట్టబెట్టడానికే జ్యుడీషియల్‌ రివ్యూ పేరిట ప్రభుత్వం క్లాజుల్లో మార్పులు చేసిందని ఆరోపించారు. అరబిందో కంపెనీకి లబ్ది చేకూర్చాలన్న కుట్రతోనే అక్రమాలకు పాల్పడ్డారని […]

Update: 2020-06-24 06:56 GMT

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో 108 అంబులెన్స్‌ల నిర్వహణలో రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభిరామ్.. మరోసారి దీనిపై మాట్లాడుతూ, తాను చేసిన ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని అరబిందో ఫౌండేషన్‌కి 108 అంబులెన్స్‌ సర్వీసులను కట్టబెట్టడానికే జ్యుడీషియల్‌ రివ్యూ పేరిట ప్రభుత్వం క్లాజుల్లో మార్పులు చేసిందని ఆరోపించారు. అరబిందో కంపెనీకి లబ్ది చేకూర్చాలన్న కుట్రతోనే అక్రమాలకు పాల్పడ్డారని పట్టాభి విమర్శించారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో సరిపడా అంబులెన్స్‌ సేవలను ఎందుకు అందించలేదని ఆయన నిలదీశారు. కరోనా సోకిన రోగులను తరలించే అంబులెన్స్‌లలోనే ఇతర రోగులను కూడా ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారని ఆయన విమర్శించారు.

Tags:    

Similar News