అచ్చెన్నాయుడి అరెస్ట్ అందుకే..: పట్టాభిరాం

దిశ, ఏపీ బ్యూరో: నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేసులో వైసీపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెట్టి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ఆరోపించారు. ఈ విషయంలో సీఎం జగన్ అడ్డంగా దొరికిపోయారన్నారు. పట్టాభి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నను రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రపన్ని అరెస్టు చేయించారని విమర్శించారు. ఈ ఆరోపణలు గతంలో వచ్చినప్పుడే పూర్తి వివరణ ఇచ్చారని, ఏ అంశంలోనైనా విచారణ […]

Update: 2020-06-14 08:08 GMT

దిశ, ఏపీ బ్యూరో: నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేసులో వైసీపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెట్టి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ఆరోపించారు. ఈ విషయంలో సీఎం జగన్ అడ్డంగా దొరికిపోయారన్నారు.

పట్టాభి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నను రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రపన్ని అరెస్టు చేయించారని విమర్శించారు. ఈ ఆరోపణలు గతంలో వచ్చినప్పుడే పూర్తి వివరణ ఇచ్చారని, ఏ అంశంలోనైనా విచారణ చేసుకోవచ్చునని సవాల్ విసిరారని గుర్తు చేశారు.

ఈనెల 10న అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేసి, 11న విచారణ పూర్తిచేసి 12న అరెస్ట్‌ చేయడం ఏంటనీ, ఒకే రోజులో విచారణ ఎలా పూర్తిచేశారో మంత్రి పేర్నినాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, సీఎం చేస్తున్న చట్టవ్యతిరేక పనులకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలకొద్దనీ, ఇది ఎప్పటికైనా మెడకు చుట్టుకుంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు.

Tags:    

Similar News