జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు : నారా లోకేశ్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారాలోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్రాలు సందించారు. జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం అధికార దుర్వినియోగాలనికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి మరోసారి ఆపరేషన్ జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులపై ఒత్తిడి తెచ్చి..ఆయన్ను బలవంతంగా డిశ్చార్జి చేయించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ మండిపడ్డారు. విచారణలో పేరుతో 24గంటలు రోడ్ల […]

Update: 2020-07-01 09:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారాలోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్రాలు సందించారు. జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం అధికార దుర్వినియోగాలనికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి మరోసారి ఆపరేషన్ జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులపై ఒత్తిడి తెచ్చి..ఆయన్ను బలవంతంగా డిశ్చార్జి చేయించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ మండిపడ్డారు. విచారణలో పేరుతో 24గంటలు రోడ్ల మీద తిప్పి ఆయనకు మరోసారి ఆపరేషన్ అవ్వడానికి కారణం అయ్యారన్నారు. సీఎం జగన్ రెడ్డి చేస్తున్న తప్పుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.

Tags:    

Similar News