గ్రామ వాలంటీర్ల ముసుగులో అఘాయిత్యాలు
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసి వెళ్లిన ఘటనపై తీవ్రంగా మండిపడ్డాయి. అయితే, తాజాగా నెల్లూరు జిల్లా రాజుపాలెంలో 9 ఏళ్ల బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. 9 ఏళ్ల బాలిక పై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడటం సభ్య సమాజం తలదించుకునే సంఘటన […]
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసి వెళ్లిన ఘటనపై తీవ్రంగా మండిపడ్డాయి. అయితే, తాజాగా నెల్లూరు జిల్లా రాజుపాలెంలో 9 ఏళ్ల బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.
9 ఏళ్ల బాలిక పై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడటం సభ్య సమాజం తలదించుకునే సంఘటన అని లోకేశ్ అన్నారు. వాలంటీర్ల ముసుగులో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం, 21 రోజుల్లోనే బాధిత మహిళలకు న్యాయం, ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు అంతా ప్రచార ఆర్భాటమే తప్ప గారి పాలనలో మహిళలకు రక్షణే లేదని విమర్శించారు. వారం వ్యవధిలోనే మైనర్ బాలికలపై రెండు అత్యాచార ఘటనలు జరిగినా ప్రభుత్వం మృగాళ్ల పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.