దొరికే వరకు అందరూ దొరలే: కేశినేని నాని
కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపనల నేపథ్యంలో సీఎం… దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో కిట్‌ను 730 రూపాయల చొప్పున లక్ష కిట్లను దిగుమతి చేసుకుందని, అంతేగాక, రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్ ఆర్డర్‌లో తక్కువ ధరకు ఎవరికైనా విక్రయిస్తే ఆ ధరనే చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రత్యేకమైన క్లాజును పెట్టిందని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటనను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, ‘దొరికే వరకూ […]
కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపనల నేపథ్యంలో సీఎం… దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో కిట్‌ను 730 రూపాయల చొప్పున లక్ష కిట్లను దిగుమతి చేసుకుందని, అంతేగాక, రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్ ఆర్డర్‌లో తక్కువ ధరకు ఎవరికైనా విక్రయిస్తే ఆ ధరనే చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రత్యేకమైన క్లాజును పెట్టిందని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటనను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, ‘దొరికే వరకూ అందరూ దొరలే. భాగవతం బయట పడిన తరువాత ఇప్పుడు డబ్బులు తగ్గించి ఇస్తాం అని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ప్రాణ భయంతో వుంటే సందట్లో సడేమియా అన్నట్లు నీ సంపాదనలో నువ్వున్నావు’ అంటూ కేశినేని నాని ఎద్దేవా చేశారు.
Tags: kesineni nani, tdp, ysrcp, rapid testing kits, bribe