క్వారంటైన్ కేంద్రం వద్ద టీడీపీ నేత హల్‌చల్

కరోనా వ్యాప్తి నిరోధానికి దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా టీడీపీ నేత అత్యుత్సహం ప్రదర్శించి విమర్శలపాలయ్యారు. దాని వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పెడనలో ప్రభుత్వం ఒక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పాటు, కరోనా అనుమానితులను అక్కడ క్వారంటైన్‌లో ఉంచింది. అక్కడికి వెళ్లేందుకు టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రయత్నించారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీలతో రవీంద్ర […]

Update: 2020-04-10 03:55 GMT

కరోనా వ్యాప్తి నిరోధానికి దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా టీడీపీ నేత అత్యుత్సహం ప్రదర్శించి విమర్శలపాలయ్యారు. దాని వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పెడనలో ప్రభుత్వం ఒక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పాటు, కరోనా అనుమానితులను అక్కడ క్వారంటైన్‌లో ఉంచింది. అక్కడికి వెళ్లేందుకు టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రయత్నించారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీలతో రవీంద్ర అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీనిపై అడిషనల్ ఎస్సీ మోకా సత్తిబాబు మాట్లాడుతూ, లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమించిన రవీంద్రపై ఐపీసీ సెక్షన్ 188, ఎపిడమిక్ యాక్ట్ 1987 కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News