‘సుదీర్ఘ ప్రజాఉద్యమం కనిపించడంలేదా’
దిశ, వెబ్‌డెస్క్: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 250 రోజులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ లీడర్ దేవినేని ఉమ అమరావతి ఉద్యమంపై ట్వీట్ చేశారు. ‘29,000 రైతులు, 34,000 ఎకరాల త్యాగం, 13000 గ్రామాలు, 3000 వార్డుల నుండి పవిత్ర మట్టి, జలం. చంద్రబాబు నాయుడి సంకల్పం, వెరసి ప్రజారాజధాని. అవమానాలు, ఇబ్బందులు, లాఠీదెబ్బలు, అసభ్యకర వ్యాఖ్యలు, తీవ్రమనోవ్యధ న్యాయం కోసం, భవిష్యత్ కోసం, భరోసా కోసం చిందిన రక్తం […]
దిశ, వెబ్‌డెస్క్: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 250 రోజులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ లీడర్ దేవినేని ఉమ అమరావతి ఉద్యమంపై ట్వీట్ చేశారు. ‘29,000 రైతులు, 34,000 ఎకరాల త్యాగం, 13000 గ్రామాలు, 3000 వార్డుల నుండి పవిత్ర మట్టి, జలం. చంద్రబాబు నాయుడి సంకల్పం, వెరసి ప్రజారాజధాని. అవమానాలు, ఇబ్బందులు, లాఠీదెబ్బలు, అసభ్యకర వ్యాఖ్యలు, తీవ్రమనోవ్యధ న్యాయం కోసం, భవిష్యత్ కోసం, భరోసా కోసం చిందిన రక్తం వెరసి 250రోజుల సుదీర్ఘ ప్రజాఉద్యమం కనిపించడం లేదా జగన్’ అంటూ దేవినేని ఓ వీడియోను పోస్ట్ చేశారు.