చస్తున్నా పట్టించుకోరా? : దేవినేని

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా కట్టడి విషయమై, కరోనా రోగులకు అందుతున్న చికిత్స విధానంపై ప్రభుత్వంపై మరోసారి టీడీపీ నేత దేవినేని ఉమా మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారయ్యారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే 5, 6 రోజుల్లో కరోనా వ్యాప్తిలో రాష్ట్రం ఢిల్లీని మించిపోతుంది. ప్రధాని చెబుతున్న మాటలు ముఖ్యమంత్రికి వినబడుతున్నాయా?. వేగంగా వైరస్ వ్యాపిస్తున్నా, ముఖ్యమంత్రి ఎందుకు తన పాలనావిధానం మార్చుకోవడం లేదు?. ప్రజల ప్రాణాలు కాపాడటానికి పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ […]

Update: 2020-07-27 00:48 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా కట్టడి విషయమై, కరోనా రోగులకు అందుతున్న చికిత్స విధానంపై ప్రభుత్వంపై మరోసారి టీడీపీ నేత దేవినేని ఉమా మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారయ్యారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే 5, 6 రోజుల్లో కరోనా వ్యాప్తిలో రాష్ట్రం ఢిల్లీని మించిపోతుంది. ప్రధాని చెబుతున్న మాటలు ముఖ్యమంత్రికి వినబడుతున్నాయా?. వేగంగా వైరస్ వ్యాపిస్తున్నా, ముఖ్యమంత్రి ఎందుకు తన పాలనావిధానం మార్చుకోవడం లేదు?. ప్రజల ప్రాణాలు కాపాడటానికి పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ త్యాగాలను గౌరవించాల్సిన పనిలేదా?. క్వారంటైన్ కేంద్రాల్లోని భోజనం తినలేక రోగులు చస్తున్నా పట్టించుకోరా?. విజయవాడలోని రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిలో ఎన్ని పడకలున్నాయో, వెంటిలేటర్లు న్నాయో చెప్పగలరా?. ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమంటారు.. అక్కడికి వెళితే ఖాళీ లేదంటారు. గుంటూరు ఆసుపత్రిలో 30 మృతదేహాలున్నాయి. తెనాలిలో పారామెడికల్ సిబ్బంది మాస్కులు, కిట్ల కోసం రోడ్డెక్కారు. ప్రశ్నించివారిని వేధింపులకు గురిచేయడం తప్ప, ప్రభుత్వం వాస్తవాలను పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడరు?. బాధ్యత గల ప్రతిపక్షనేత చేస్తున్న మాత్రం కూడా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోతున్నాడు?. మద్యం అమ్మకాలద్వారా వచ్చే జే-ట్యాక్స్ పై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదా?. కరోనా బాధితుల గోడు వారి వెతలు ముఖ్యమంత్రికి వినబడటం లేదా?” అంటూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు.

Tags:    

Similar News