Tension: రేపు ఎంపీపీ ఎన్నిక.. నేడు 9 మంది ఎంపీటీసీల అదృశ్యం

పల్నాడు జిల్లాలో 9 మంది ఎంపీటీసీలు అదృశ్యం కలకలం రేపింది..

Update: 2025-03-26 14:06 GMT
Tension: రేపు ఎంపీపీ ఎన్నిక.. నేడు 9 మంది ఎంపీటీసీల అదృశ్యం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District)లో 9 మంది ఎంపీటీసీలు(Mptc) అదృశ్యం కలకలం రేపింది. అచ్చంపేట ఎంపీపీ(Mpp) ఎన్నిక శుక్రవారం జరగనుంది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి అత్యవసర సమావేశం నిర్వహించాలని వైసీపీ(Ycp) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎంపీటీసీలు అదృశ్యంకావడం వివాదాస్పదంగా మారింది.  

కాగా అచ్చంపేట మండల పరిషత్‌లో మొత్తం 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో 16 మంది వైసీపీ నుంచి గెలిచారు. కూటమి నుంచి ఒకరు విజయం సాధించారు. అయితే అచ్చంపేటలో ఇప్పటివరకూ వైసీపీకి చెందిన రజినీ బాయ్(YSRCP Mpp Rajini Boy ) ఎంపీపీగా పని చేశారు. అయితే ఆమె అనివార్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు అచ్చంపేట ఎంపీపీపై కూటమి నాయకులు దృష్టి సారించారు. అచ్చంపేట ఎంపీపీని దక్కించుకునేందుకు పావులు కదిపారు. భూక్యా స్వర్ణమ్మను ఎంపీపీగా చేసేందుకు TDP ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఉ.11 గంటలకు అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 9 మంది ఎంపీటీసీలు అదృశ్యమయ్యారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నేతలపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన 9 మంది ఎంపీటీసీలను అర్ధరాత్రి సమయంలో కూటమి నాయకులే తీసుకెళ్లారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News