CM Revanth Reddy : తెలంగాణ విద్యావ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బుధవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బుధవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు. రాష్ట్రంలో విద్యావ్యస్థపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. 2021లో విద్యార్థులపై జరిగిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 75 శాతం మంది 3, 5వ తరగతి విద్యార్థులు సామర్థ్యం చాలా తక్కువ ఉందని తేలిందన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ విషయ పరిజ్ఞానంలో తెలంగాణ దేశంలో 36వ స్థానంలో ఉందన్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 5వ తరగతి విద్యార్థులు కనీసం 3వ తరగతి పుస్తకాలు కూడా చదవలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 11 వేల టీచర్ల నియామకం చేపట్టామని, 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని అన్నారు. బడ్జెట్ లో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. రూ.23,108 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. విద్యపై ప్రభుత్వమే కాదు సమాజం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యపై రాజకీయ దురుద్దేశం వదిలేయకపోతే విద్యారంగం ప్రక్షాళన కాదని తెలిపారు.