నాపై కేసు పెడతారా.. ఖబర్దార్ సీఎం :చంద్రబాబు

దిశ, వెబ్‌డెస్క్: రామతీర్థం పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే ప్రభుత్వం తల వంచుకోవాలన్నారు. రామతీర్థం పర్యటన చేపట్టడంతో ప్రభుత్వం భయపడి తమపై నిందలు వేస్తోందన్నారు.తనపై కేసు పెడతారా.. ఖబర్దార్ సీఎం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రామతీర్థం ఘటన జరిగి ఐదు రోజులైనా ఎందుకు పట్టించుకోడం లేదని ప్రశ్నించారు. జగన్ ఒక క్రిస్టియన్.. అతని నమ్మకం అతనిది.. మా నమ్మకం మాది […]

Update: 2021-01-05 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: రామతీర్థం పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే ప్రభుత్వం తల వంచుకోవాలన్నారు. రామతీర్థం పర్యటన చేపట్టడంతో ప్రభుత్వం భయపడి తమపై నిందలు వేస్తోందన్నారు.తనపై కేసు పెడతారా.. ఖబర్దార్ సీఎం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రామతీర్థం ఘటన జరిగి ఐదు రోజులైనా ఎందుకు పట్టించుకోడం లేదని ప్రశ్నించారు.

జగన్ ఒక క్రిస్టియన్.. అతని నమ్మకం అతనిది.. మా నమ్మకం మాది అని చంద్రబాబు అన్నారు. మన దేవాలయాలను మనమే కాపాడుకుందామని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. విజయనగరం ఎస్పీ ఒక మహాతల్లి, ఆమె తమను అడ్డుకుందని తెలిపారు. సీఎం జగన్, హోంమంత్రి, డీజీపీతో పాటు స్థానిక ఎస్పీ క్రిస్టియన్లు అయినంత మాత్రాన.. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆపరా అంటూ ప్రశ్నించారు. మతమార్పిడులు చేయించే అధికారం సీఎంకు ఎవరిచ్చారని నిలదీశారు.

Tags:    

Similar News