కరోనా సెంటర్లుగా మేం కట్టించిన ఇండ్లా : చంద్రబాబు

దిశ, అమరావతి బ్యూరో : తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను కరోనా సెంటర్లుగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ప్రవేశ పెట్టిన పథకాలు జనం కోసం కాదని ఆయన విమర్శించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానంపై మంగళవారం టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెలుగు తమ్ముళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో వైసీపీ దోచుకు […]

Update: 2020-07-07 04:03 GMT

దిశ, అమరావతి బ్యూరో : తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను కరోనా సెంటర్లుగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ప్రవేశ పెట్టిన పథకాలు జనం కోసం కాదని ఆయన విమర్శించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానంపై మంగళవారం టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెలుగు తమ్ముళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో వైసీపీ దోచుకు తింటోందని ఫైర్ అయ్యారు. తప్పుడు కేసులు పెట్టి తమ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో కట్టించిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు నిర్మించామని చంద్రబాబు గుర్తుచేశారు. ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో వైసీపీ లీడర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News