‘అల వైఎస్ అవినీతి పురములో’ టైటిల్‌తో సినిమా

దిశ,విశాఖపట్నం: ఇళ్లపట్టాల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి ఉందంటూ ఆరోపించారు. తన ఆరోపణలు అవాస్తం అని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఈ సందర్భంగా బండారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారీ స్థాయిలో జరుగుతున్న ఇళ్ల స్థలాల అవినీతిపై […]

Update: 2020-12-28 06:28 GMT

దిశ,విశాఖపట్నం: ఇళ్లపట్టాల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి ఉందంటూ ఆరోపించారు. తన ఆరోపణలు అవాస్తం అని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

ఈ సందర్భంగా బండారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారీ స్థాయిలో జరుగుతున్న ఇళ్ల స్థలాల అవినీతిపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీయాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఆ సినిమాకు ‘అల వైఎస్ అవినీతి పురములో’ అనే టైటిల్ పెట్టాలని కూడా సూచించారు. అంతేకాకుండా ఆ సినిమాలలో అవినీతి ముఖ్యమంత్రి జగన్ పాత్రను తాను పోషిస్తానని చెప్పారు. తాను నటుడినేనని, తాను జగన్‌ను బాగా స్టడీ చేశానన్నారు. ఆయన అవినీతి తనకు బాగా తెలుసని, అందుకే ఆ పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. వర్మ అవకాశం ఇస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News