అచ్చెన్నాయుడు ఎన్ఆర్‌ఐ ఆస్పత్రికి తరలింపు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఆయన ఇటీవల కరోనా బారిన కూడా పడ్డారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అచ్చెన్నాయుడిని పోలీసులు రమేశ్‌ ఆస్పత్రి నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రమేశ్‌ ఆస్పత్రి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడిని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించాలని పోలీసులను హైకోర్టు […]

Update: 2020-08-17 11:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఆయన ఇటీవల కరోనా బారిన కూడా పడ్డారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అచ్చెన్నాయుడిని పోలీసులు రమేశ్‌ ఆస్పత్రి నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించనున్నారు.

దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రమేశ్‌ ఆస్పత్రి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడిని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయన్ను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News