సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు సీఎం జగనే కారణమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పాదయాత్రలో ‘నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చూశాను అన్న జగన్ ఇప్పుడు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఎక్కడ ఉన్నారని నిలదీశారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 10 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడమేంటని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చేసిన మోసం వల్లే […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు సీఎం జగనే కారణమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పాదయాత్రలో ‘నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చూశాను అన్న జగన్ ఇప్పుడు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఎక్కడ ఉన్నారని నిలదీశారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 10 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడమేంటని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చేసిన మోసం వల్లే యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందన్నారు. కర్నూలు జిల్లా చనుగొండ్ల గ్రామంలో గోపాల్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.
గోపాల్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇంటికోక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. రెండేళ్లలోనే కోటి మందికి ఉపాధి పోగొట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందని విమర్శించారు. 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు మోడీకి వంగి, వంగి నమస్కారాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై చేతులెత్తేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.