సెకీ ఒప్పందంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలి: కళా వెంకట్రావు

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్‍కు వెళ్లిన ప్రభుత్వం సెకీ ఒప్పందం విషయంలో ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్రం ఆమోదించిన వారికే టెండర్లు దక్కినప్పటికీ రివర్స్ టెండరింగ్‍కు వెళ్లిన విషయం ప్రభుత్వం […]

Update: 2021-11-08 04:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్‍కు వెళ్లిన ప్రభుత్వం సెకీ ఒప్పందం విషయంలో ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్రం ఆమోదించిన వారికే టెండర్లు దక్కినప్పటికీ రివర్స్ టెండరింగ్‍కు వెళ్లిన విషయం ప్రభుత్వం మరిచిందా? అని నిలదీశారు. సెకీ నుంచి యూనిట్ రూ.1.99కే విద్యుత్ లభిస్తుంటే రూ.2.49కి ఎందుకు కొనుగోలుచేస్తున్నారో స్పష్టత ఇవ్వాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. సోలార్ పవర్ కొనుగోళ్లపై ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‍కు వెళ్లాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు హితవు పలికారు.

Tags:    

Similar News