అన్నీ గుర్తుపెట్టుకుంటాం.. తర్వాత బదులు తీరుస్తాం : Chandra babu Naidu
దిశ, ఏపీ ప్రభుత్వం: జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులతో ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు. చివరికి సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టినా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పులను సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒక ఉన్మాది పాలనలో పోలీసులు కూడా స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. మంగళవారం చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. నరేంద్ర యోగక్షేమాలు అడిగి […]
దిశ, ఏపీ ప్రభుత్వం: జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులతో ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు. చివరికి సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టినా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పులను సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒక ఉన్మాది పాలనలో పోలీసులు కూడా స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.
మంగళవారం చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. నరేంద్ర యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు అన్నీ గుర్తు పెట్టికుంటాం.. తర్వాత బదులు తీరిస్తాం అంటూ చంద్రబాబు హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే వైసీపీ నేతలు ఒక్కరు కూడా ఉండేవారు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ అవినీతికి ఇప్పుడున్న కోర్టులు చాలవు
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్రది రాజకీయ చరిత్ర గల కుటుంబమన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. రైతులకు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, నరేంద్ర ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. అలాంటి కుటుంబానికి చెందిన నరేంద్రను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో మంచిది కాదని సూచించారు.
సహకార రంగం నుంచి కంపెనీ చట్టంలోకి సంగం డెయిరీ చట్ట ప్రకారమే వెళ్లిందని… కానీ నరేంద్రను అమానుషంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. పోలీసులు కనీసం నోటీసులు ఇవ్వకుండా.. తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు అరెస్టు చేశారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడుతో మొదలైన అరెస్టులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయన్నారు. నరేంద్ర ఆస్తులు గతంలో ఎంత..? ఇప్పుడు ఎంతో చూడండి… 2004కు ముందు జగన్ కుటుంబ ఆస్తులు, ఇప్పుడు ఆస్తులు ఎంతో చూడాలని తెలిపారు. ప్రభుత్వంలో 43 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు.
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవన్నారు. నరేంద్ర కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల కోసమే వైసీపీ అరాచకాలు భరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చంద్రబాబు హెచ్చరించారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పోలీసులను సైతం చంద్రబాబు హెచ్చరించారు.