విజయవంతమైన టీసీఎస్, ఎయిర్‌టెల్ 5జీ టెక్నాలజీ ప్రయోగం!
దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ ద్వారా టీసీఎస్ ఆల్ట్రాఫాస్ట్ సాఫ్ట్‌వేర్ మేజర్ న్యూరల్ మాన్యూఫాక్చరింగ్ సోల్యూషన్స్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు ఇరు కంపెనీలు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఈ టెక్నాలజీ కోసం టెలికాం విభాగం ఎయిర్‌టెల్‌కు 5జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. దీని ద్వారా మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రదేశాలు, కెమికల్ ప్లాంట్ వంటి ప్రమాదకరమైన వాతావరణాల్లో పనిచేసే రోబోటిక్స్ కార్యకలాపాలను ప్రారంభించవచ్చని కంపెనీలు వివరించాయి. దేశీయ కంపెనీలు 5జీ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన […]
దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ ద్వారా టీసీఎస్ ఆల్ట్రాఫాస్ట్ సాఫ్ట్‌వేర్ మేజర్ న్యూరల్ మాన్యూఫాక్చరింగ్ సోల్యూషన్స్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు ఇరు కంపెనీలు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఈ టెక్నాలజీ కోసం టెలికాం విభాగం ఎయిర్‌టెల్‌కు 5జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించింది. దీని ద్వారా మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రదేశాలు, కెమికల్ ప్లాంట్ వంటి ప్రమాదకరమైన వాతావరణాల్లో పనిచేసే రోబోటిక్స్ కార్యకలాపాలను ప్రారంభించవచ్చని కంపెనీలు వివరించాయి. దేశీయ కంపెనీలు 5జీ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించాలని చూస్తున్నాయి.
ఈ క్రమంలోనే రిమోట్ రోబోటిక్స్ కార్యకాలాపాల కోసం ఎయిర్‌టెల్, టీసీఎస్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌టెల్ 5జీ ద్వారా రోబోటిక్స్ నిర్వహణ, విజన్ ఆధారిత నాణ్యతల తనిఖీని టీసీఎస్ కంపెనీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరీక్ష ద్వారా టీసీఎస్‌కు చెందిన న్యూరాల్ మాన్యూఫాక్చరింగ్ పరిష్కారాలు, నాణ్యమైన ఉత్పాదకత, భద్రతను పెంచేందుకు వీలవుతుంది. పారిశ్రామిక కార్యకలాపాల్లో 5జీ టెక్నాలజీ వినియోగం పై ఇది సానుకూల పరిణామమని, రాబోయే రోజుల్లో మరిన్ని రంగాల్లో 5జీ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని టీసీఎస్ వెల్లడించింది.