Car Discounts: రెండున్నర లక్షల రూపాయల డిస్కౌంట్ ఇస్తున్న ఫారిన్ బ్రాండ్ కారు.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Car Discounts: మీరు ఈ నెలలో ( మార్చి) కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.
దిశ,వెబ్‌డెస్క్: Car Discounts: మీరు ఈ నెలలో ( మార్చి) కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆఫర్(Car Discounts). ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ (Citroen)తన కార్లపై రూ. 2.5లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకే మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ తన పాత కార్ల స్టాక్ ను క్లియర్ చేస్తోంది.
దాదాపు 6ఏళ్ల క్రితం భారత మార్కెట్లోకి అడుపెట్టిన ఫ్రెంచ్ కార్ల తయారుదారీ సంస్థ సిట్రోయెన్(Citroen) తన కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 2019లో పీఎస్ఏ గ్రూప్ సీకే బిర్లా గ్రూప్(CK Birla Group) తో జాయింట్ వెంచర్ లో భారత్ లో సిట్రోయెన్ బ్రాండ్(Citroen brand) ను ప్రారంభించింది. సిట్రోయెన్ ఇండియా సి5 ఎయిర్ క్రాస్ ఎస్ యూవీ(Citroen India C5 Aircross SUV), సీ3, ఈ-సీ3లను తయారు చేస్తోంది. ఈ కంపెనీ తన కార్లను అమ్మడానికి బంపర్ ఆఫర్లను అందిస్తోంది. సిట్రోయెన్ (Citroen)కార్లపై రెండు లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
మీరు ఒకవేళ మార్చిలో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే..మీకు మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్(Citroen) తన కార్లపై రూ. 2.5లక్షల వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే చెల్లుతుంది. కంపెనీ తన పాతకార్ల స్టాక్ ను క్లియర్ చేయడంలో భాగంగా ఈ డిస్కౌంట్ ను అందిస్తోంది. సిట్రోయెన్ ఇండియా (Citroen India)తన కార్లపై రూ. 1.75లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ మార్చి 31, 2025 వరకు మాత్రమే చెల్లుతుంది. సిట్రోయెన్(Citroen) ప్రజయోనాల గురించి వివరాల కోసం కస్టమర్లు డీలర్ షిప్ ను సంప్రదించాలని కంపెనీ తెలిపింది.
సిట్రోయెన్ సీ3(Citroen C3):
ఇది ఆ కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసిన తొలి కారు. హ్యాచ్ బ్యాక్ కారు ఇది. మూడు వేరియంట్లలో లభిస్తుంది. లైవ్, ఫిల్, షైన్. సీ3 ధర రూ. 6.16లక్షల నుంచి రూ. 10. 15లక్షల మధ్య ఉంటుంది. రెండు ధరలు ఎక్స్ షోరూమ్. ఇది టర్బోఛార్డ్జ్ పెట్రోల్ ఇంజిన్ తో కూడిన సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజిన్. బేస్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. టర్బో ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ను పొందుతుంది. ప్రస్తుతం సీ3 కారు రూ. లక్ష విలువైన ప్రయోజనాలతో అందుబాటులో ఉంది.
సిట్రోయెన్ ఈసీ3(Citroen EC3):
సిట్రోయెన్ ఈసీ3 23 మోడల్స్ పై 80వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్ నుంచి మార్కెట్లో అమ్ముడవుతున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఇది. దీని ధర రూ. 12.76లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.41 లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ధరలు ఇవి. సిట్రోయెన్ ఈసీ3 రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీనికి 29.2 kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. ముందు ఇరుసుపై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ శక్తినిచ్చేది. ఇది గరిష్టంగా 56బీహెచ్ పీల శక్తిని , 143 ఎన్ఎమ్ ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
సిట్రోయెన్ ఎయిర్ క్రాస్(Citroen Aircross):
సిట్రోయెన్ ఎయిర్ క్రాస్ కారుపై రూ. 1.75లక్షల ప్రయోజనం అందిస్తుంది. ఇది 23స్టాక్ లలో లభిస్తుంది. ఎయిర్ క్రాస్ ధర రూ. 8.49లక్షల నుంచి రూ. 14. 55లక్షల మధ్య ఉంటుంది. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ ఎస్ యూవీ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తుంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6 స్పీడ్ టార్కర్ కన్వర్టర్ ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది.
సిట్రోయెన్ బసాల్ట్(Citroen Basalt):
సిట్రోయెన్ బసాల్ట్ భారత మార్కెట్లో అత్యంత చౌకైన కూపే ఎస్ యూవీ. ఈ కారుపై రూ. 1.70లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇది 24స్టాక్ లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర దాదాపు 8.25 లక్షల నుంచి 14లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ధరలే.