2025 BYD Atto 3 Launched: రూ.30,000.. సూపర్‌ కారు లాంచ్‌.. ఫస్ట్‌ బుక్‌ చేసుకున్న వారికి స్పెషల్‌ గిఫ్ట్!

2025 BYD Atto 3 Launched: ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే...బీవైడీ(BYD) మీకు మంచి ఛాన్స్ అందిస్తోంది.

Update: 2025-03-12 06:14 GMT

దిశ, వెబ్ డెస్క్: 2025 BYD Atto 3 Launched: ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే...బీవైడీ(BYD) మీకు మంచి ఛాన్స్ అందిస్తోంది.2025 బీవైడీ అట్టూ(2025 BYD Atto 3) 3 భారత్ లో లాంచ్ అయ్యింది. ప్రత్యేకత ఏంటంటే దీనికోసం బుకింగ్ మొత్తాన్ని కంపెనీ కేవలం రూ. 30, 000 వద్ద ఉంచింది. మొదటి 3,000 మంది వినియోగదారులు దీనిని 2024 మోడల్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే దీని తర్వాత కంపెనీ కారు ధరను పెంచే అవకాశం ఉంది.

ఇప్పుడు ఈ కారులో ముందు సీట్లకు వెంటిలేషన్ ఫీచర్స్ ఉంటాయి. ఇది వేసవి కాలంలో కూడా చల్లగా ఉంటుంది. మునుపటగి డ్యూయల్ టోన్ థీమ్ స్థానంలో ఇప్పుడు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ తో భర్తీ అవుతుంది. ఇది కారును మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తుంది. లిథియం ఫెర్రో ఫాస్పేట్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 2025 బీవైడీ అట్టూ 3(2025 BYD Atto 3) రెండు బ్యాటరీ ప్యాకులతో వస్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ 49.92కిలోవాట్లు. దీని రేంజ్ 468 కిలోమీటర్లు. మరొకటి 521 కిలోమీటర్ల రేంజ్ గల 60.48 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

బీవైడీ అట్టూ 3(2025 BYD Atto 3) ధర చూసినట్లయితే డైనమిక్ వేరియంట్ ధర రూ. 24.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో ప్రీమియం వేరియంట్ ధర రూ. 29.85లక్షలు. ఇది కాకుండా సుపీరియర్ వేరియంట్ ధరరూ. 33.99లక్షలు ఉంది. 2025 బీవైడీ అట్టూ 3(2025 BYD Atto 3) మొదటి 3,000 మంది వినియోగదారులకు పాత ధర వద్ద మాత్రమే లభిస్తుంది. ఇది మెరుగైన బ్యాటరీ, కొత్త ప్రీమియం ఇంటీరియర్ కలిగి ఉంటుంది. బీవైడీ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ భారత మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇప్పటి వరకు 3,100 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే ఇది మీకు ఉపయోగపడవచ్చు.



Read More..

Jio SpaceX Deal: ఎయిర్‌టెల్‌, జియోతో స్పేస్‌ఎక్స్ బంపర్‌ డీల్‌.. ఇండియాకు మస్క్‌ స్టార్‌లింక్ ఇంటర్నెట్‌!  

Tags:    

Similar News