ఆ కంపెనీలకు టాటాసన్స్ నిధులు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభంతో దెబ్బతిన్న కంపెనీ గ్రూప్ వ్యాపారాలను ఆదుకోవాలని టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నిర్ణయించింది. కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్ కారణంగా టాటా గ్రూప్‌లోని హౌసింగ్, ఎయిర్‌లైన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హోట వ్యాపారాలు నష్టాలను భర్తీ చేసేందుకు దాదాపు 1 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించాలని టాటాబోర్డు భావిస్తోంది. అంతేకాకుండా, సుప్రీంకోర్టు ఏజీఆర్‌పై తీర్పు వల్ల దివాలా స్థాయిలో ఉన్న టెలికాం సర్వీసెస్‌కు అధికంగా నిధులను కేటాయించాలని బోర్డు సమావేశంలో […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభంతో దెబ్బతిన్న కంపెనీ గ్రూప్ వ్యాపారాలను ఆదుకోవాలని టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నిర్ణయించింది. కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్ కారణంగా టాటా గ్రూప్‌లోని హౌసింగ్, ఎయిర్‌లైన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హోట వ్యాపారాలు నష్టాలను భర్తీ చేసేందుకు దాదాపు 1 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించాలని టాటాబోర్డు భావిస్తోంది. అంతేకాకుండా, సుప్రీంకోర్టు ఏజీఆర్‌పై తీర్పు వల్ల దివాలా స్థాయిలో ఉన్న టెలికాం సర్వీసెస్‌కు అధికంగా నిధులను కేటాయించాలని బోర్డు సమావేశంలో టాటా బోర్డు నిర్ణయించింది. అలాగే, టాటా పవర్‌లో రుణ తగ్గింపులపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. కరోనా వల్ల యూరప్‌లోని టాటా స్టీల్, జాగ్వార్ ప్లాంట్‌లను కొన్నాళ్లు మూసేయడం జరిగింది. తక్కువ సంఖ్యలో కార్మికులతో ఇటీవల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. పైగా, జేఎల్ఆర్ సీఈవో పదవీ కాలం ముగుస్తుండటంతో, సెప్టెంబర్ తర్వాత కొత్త సీఈవోను ప్రకటించనున్నారు. టాటాగ్రూప్‌లో టీసీఎస్ మినహా అన్ని వ్యాపారాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎయిర్‌లైన్ వ్యాపరారం మరింత నష్టాలను చూసే అవకాశం ఉందని భావించిన టాటా బోర్డు గత నెలలో అదనపు పెట్టుబడులు పెట్టింది. టాటా గ్రూప్ యాజమాన్యం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,000 కేట్ల డివిడెండ్‌లో, ఏజీఆర్ బకాయిల నిమిత్తం రూ. 14 వేల కోట్లను టెలికాం సర్వీసెస్ కోసం కేటాయించింది.