ఆ వాహనాల పరిశ్రమ వృద్ధి సాధిస్తుంది : టాటా మోటార్స్

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ వాహనాల పరిశ్రమ 30 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ అంచనా వేసింది. కంపెనీ గురువారం తన లైట్ కమర్షియల్ ట్రక్ ఆల్ట్రా స్లీక్ టీ-సిరీస్ వాహనాలను విడుదల చేసింది. వీటి ధర రూ. 13.99 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ వాహనాన్ని తీసుకురావడం ద్వారా దేశీయ మార్కెట్లో ఈ విభాగంలోని వాహనాల డిమాండ్ పునరుద్ధరణకు వీలవుతుందని […]

Update: 2021-03-11 09:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ వాహనాల పరిశ్రమ 30 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ అంచనా వేసింది. కంపెనీ గురువారం తన లైట్ కమర్షియల్ ట్రక్ ఆల్ట్రా స్లీక్ టీ-సిరీస్ వాహనాలను విడుదల చేసింది. వీటి ధర రూ. 13.99 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ వాహనాన్ని తీసుకురావడం ద్వారా దేశీయ మార్కెట్లో ఈ విభాగంలోని వాహనాల డిమాండ్ పునరుద్ధరణకు వీలవుతుందని కంపెనీ భావిస్తోంది. ‘ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి సానుకూలంగా నమోదైంది. వచ్చే ఏడాది కూడా రెండంకెల వృద్ధిని పెరుగుతాయని ప్రభుత్వం, ఆర్‌బీఐ అంచనా వేశాయి. ఈ క్రమంలో కమర్షియల్ వాహనాల(సీవీ) పరిశ్రమ మొత్తం దేశీయ ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది సీవీ పరిశ్రమ వృద్ధి సాధించాలని ఆశిస్తున్నాం. అదే గనక జరిగితే రెండేళ్ల ప్రతికూలత తర్వాత తాము మళ్లీ పుంజుకున్నట్టే అని’ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గిరీష్ వాగ్ వెల్లడించారు.

Tags:    

Similar News