టాటామోటార్స్ త్రైమాసిక నష్టం రూ.9,864కోట్లు!
ముంబయి: గత ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ ఏకీకృత నికర నష్టం రూ.9,863.75కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,108.66కోట్ల నికర లాభం నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.62,492.96కోట్లకు తగ్గిందని, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.86,422.33కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు కంపెనీ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా కంపెనీ ప్రధాన అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) మార్చి త్రైమాసికంలో 501 మిలియన్ […]
ముంబయి: గత ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ ఏకీకృత నికర నష్టం రూ.9,863.75కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,108.66కోట్ల నికర లాభం నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.62,492.96కోట్లకు తగ్గిందని, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.86,422.33కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు కంపెనీ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా కంపెనీ ప్రధాన అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) మార్చి త్రైమాసికంలో 501 మిలియన్ డాలర్లు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 422 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. జేఎల్‌ఆర్ అమ్మకాలు పూర్తి సంవత్సరంలో 12శాతం తగ్గి 5,08,700 యూనిట్లకు చేరుకోగా, దేశీయంగా వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 22శాతం తగ్గాయి. వ్యక్తిగత వాహనాల్లో 25శాతం పడిపోయాయని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘చైనాలో, వాహన అమ్మకాల్లో కోలుకుంటున్నాం. వినియోగదారులు మా షోరూమ్‌లకు తిరిగి వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ చేపట్టిన కార్యాచరణ సానుకూల ఫలితాలను ఇస్తాయని’ జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్పెత్ చెప్పారు.