సఫారీ మోడల్‌లో ప్రత్యేక 'గోల్డ్ ఎడిషన్' తీసుకొచ్చిన టాటా మోటార్స్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ శుక్రవారం తన సఫారీ మోడల్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 21.89 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ మోడల్ వేరియంట్ పెద్ద ఎస్‌యూవీల విభాగంలో పోటీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సఫారీ గోల్డ్ పేరుతో తెచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ బ్లాక్ గోల్డ్, వైట్ […]

Update: 2021-09-17 11:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ శుక్రవారం తన సఫారీ మోడల్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 21.89 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ మోడల్ వేరియంట్ పెద్ద ఎస్‌యూవీల విభాగంలో పోటీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సఫారీ గోల్డ్ పేరుతో తెచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్ బ్లాక్ గోల్డ్, వైట్ గోల్డ్‌లుగా రెండు రంగుల్లో లభించనున్నాయి. ఈ మోడల్ ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో ప్రదర్శనకు ఉంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ప్రత్యేకంగా తెచ్చిన ఈ ఎడిషన్ మోడల్‌లో మొదటి రెండు సీట్ల వరుసలలో వెంటిలేషన్‌తో కూడిన లెదర్ సీట్ల వంటి ప్రీమియం ఫీచర్లను అందించామని కంపెనీ వివరించింది. అలాగే, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైఫై వంటి అన్ని రకాల అధునాతన ఫీచర్లను ఈ వాహనంలో అందించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రీమితం ఫ్లాఫ్‌షిప్ ఎస్‌యూవీ విభాగంలో తీసుకొచ్చిన సఫారీ మోడల్ ఐదు నెలల్లొనే 10 వేల యూనిట్ల మైలురాయిని నమోదు చేసింది. ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలించిందని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగం హెడ్ వివేక్ చెప్పారు.

Tags:    

Similar News