క్యూర్‌ఫిట్‌తో టాటా సన్స్ అవగాహనా ఒప్పందం

దిశ, వెబ్‌డెస్క్: హెల్త్ అండ్ ఫిట్‌నెస్ స్టార్టప్ క్యూర్‌ఫిట్ కంపెనీలో దేశీయ ప్రముఖ సంస్థ టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా డిజిటల్ సుమారు రూ. 540 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. టాటా-క్యూర్‌ఫిట్ ఒప్పందంలో భాగంగా క్యూర్‌ఫిట్ వ్యవస్థాపకుడు ముఖేశ్ బన్సల్ టాటా డిజిటల్ లిమిటెడ్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. డిజిటల్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ లాంటి సంస్థలతో పోటీగా నిలిచేందుకు టాటా సంస్థ ఇప్పటికే […]

Update: 2021-06-07 09:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: హెల్త్ అండ్ ఫిట్‌నెస్ స్టార్టప్ క్యూర్‌ఫిట్ కంపెనీలో దేశీయ ప్రముఖ సంస్థ టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా డిజిటల్ సుమారు రూ. 540 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. టాటా-క్యూర్‌ఫిట్ ఒప్పందంలో భాగంగా క్యూర్‌ఫిట్ వ్యవస్థాపకుడు ముఖేశ్ బన్సల్ టాటా డిజిటల్ లిమిటెడ్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు.

డిజిటల్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ లాంటి సంస్థలతో పోటీగా నిలిచేందుకు టాటా సంస్థ ఇప్పటికే కిరాణా విభాగంలో బిగ్‌బాస్కెట్‌ను, ఈ-ఫార్మా విభాగంలో 1ఎంజీని కొనుగోలు చేసింది. కాగా, ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ మింత్రాకు సహ-వ్యవస్థాపకుడిన ముఖేష్ బన్సల్ ఐదేళ్ల క్రితం క్యూర్‌ఫిట్‌ను ప్రారంభించారు. ఫ్లిప్‌కార్ట్‌కే చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంకిత్ నాగోరితో కలిసి ఈ వెంచర్‌ను మొదలుపెట్టారు.

Tags:    

Similar News